తెలంగాణ

telangana

ETV Bharat / state

పరకాలలో కరోనా విజృంభణ.. స్థానికుల్లో ఆందోళన - పరకాలలో కరోనా కేసులు తాజా వార్త

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో కరోనా విలయతాండవం చేస్తోంది. బుధవారం ఒక్కరోజే 14 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. ఇప్పటి వరకు పట్టణంలో మహమ్మారి బారిన పడిన బాధితుల సంఖ్య 80కి చేరింది.

corona-cases-in-parakala-warangal-rural-district
పరకాలలో కరోనా విజృంభన.. స్థానికల్లో ఆందోళన

By

Published : Jul 30, 2020, 8:08 PM IST

Updated : Jul 30, 2020, 8:15 PM IST

వరంగల్​ రూరల్​ జిల్లా పరకాల పట్టణంలో రోజురోజుకు విజృంభిస్తోన్న కరోనా స్థానికులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బుధవారం ఒక్క రోజే పట్టణంలో 14 మంది వైరస్​ బారిన పడ్డారు. వీటితో కలిపి ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్​ కేసుల సంఖ్య 80కి చేరింది.

అయితే తాజాగా నమోదైన కేసుల్లో ఒకే కుటుంబానికి చెందిన పది మంది మహమ్మారి బారిన పడగా.. భూపాలపల్లి రోడ్డులోని ఒకే కాలనీకి చెందిన ఆరుగురికి ఇప్పటికే వైరస్ నిర్ధారణ అయ్యింది. కాగా ప్రస్తుతం మరో 10 మందికి పాజిటివ్​ అని తెలిసి స్థానికజనం భయాందోళనలకు గురవుతున్నారు.

ఇదీ చదవడి:సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్

Last Updated : Jul 30, 2020, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details