భారత రాజ్యాంగ దినోత్సవం పురష్కరించుకుని వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని ఇరవైతొమ్మిది గ్రామపంచాయతీలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. మండలకేంద్రంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు ర్యాలీ చేశారు. రాజ్యాంగ నియమాలు అనుసరించి బాధ్యత యుతంగా నడుచుకుంటామని విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మండలపరిషత్ అధ్యక్షురాలు ఊడుగుల సునితాప్రవీణ్, ఎంపీడీవో శంకర్, మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ర్యాలీ - నల్లబెల్లిలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాలు
70వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ గ్రామీణ జిల్లాలో మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. నల్లబెల్లి మండలంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
నల్లబెల్లిలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాలు