వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దాదాపు 100 మందికి పైగా తెరాస కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కొండా కోరారు. శాయంపేటకు వస్తే పుట్టింటికి వచ్చినట్లు ఉంటుందని, తన ఎదుగుదలకు శాయంపేట చేసిన కృషిని మరిచిపోనని స్పష్టం చేశారు.
'కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక ఆధిక్యంతో గెలిపించాలి' - shayampeta
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అత్యధిక ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు గెలవాలని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఆకాక్షించారు.
శాయంపేటకు వస్తే పుట్టింటికి వచ్చినట్లు ఉంటుంది : కొండా