గుండెపోటుతో మృతిచెందిన ఆర్టీసీ కార్మికుడు రవీందర్ అంతిమయాత్ర భారీ బందోబస్తు నడుమ సాగింది. దారిపొడవునా కార్మిక సంఘం నేతలు నినాదాలు చేస్తూ ముందుకు సాగగా పరకాలకు చెందిన ఓ పోలీసు అధికారి సివిల్ డ్రెస్లో కార్మికులపై దురుసుగా ప్రవర్తించడం వల్ల ఉద్రిక్తతకు దారితీసింది. అధికారి వైఖరిని నిరసిస్తూ కార్మికులు వరంగల్ భూపాలపల్లి రహదారిపై పోలీసు ఉన్నతాధికారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా అంతిమయాత్ర సాగుతున్న క్రమంలో కార్మికులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి కార్మికులను రెచ్చగొడుతున్నారని కార్మిక సంఘం నాయకులు ఆరోపించారు. పరకాల ఏసీపీ రంగ ప్రవేశం చేసి కార్మిక సంఘం నాయకులకు నచ్చచెప్పటం పరిస్థితి శాంతించింది.
కండక్టర్ రవీందర్ అంతిమయాత్రలో ఉద్రిక్తత - Conductor Ravinder Dead-march in Warngal Rural district
వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరులో ఆర్టీసీ కండక్టర్ రవీందర్ అంతిమయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
కండక్టర్ రవీందర్ అంతిమయాత్రలో ఉద్రిక్తత