వరంగల్ గ్రామీణజిల్లాలో జిల్లా కలెక్టర్ హరిత పర్యటించారు. రాయపర్తి మండల కేంద్రంలో గ్రామ పార్కు ఏర్పాటుకై స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పల్లె ప్రగతి, హరితహారంపై మండల స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మొక్కలు సిద్ధం చేయండి: కలెక్టర్ హరిత - latest news of warangal rural
వరంగల్ గ్రామీణ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ హరిత పర్యటించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు మొక్కలను సకాలంలో అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![మొక్కలు సిద్ధం చేయండి: కలెక్టర్ హరిత collector haritha visited villages in warangal rural](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7846574-557-7846574-1593598553540.jpg)
మొక్కలు సిద్ధం చేయండి: కలెక్టర్ హరిత
హరితహారం కార్యక్రమానికి అన్ని గ్రామాల్లోని తీసుకెళ్లాలని.. మొక్కల పెంపక క్షేత్రాలను సన్నద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో మొక్కలు అందించకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇదీ చదవండి:కేబినెట్ భేటీపై నేడు నిర్ణయం.. లాక్‌డౌన్‌పై చర్చ!