ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారిని నిలువరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, పోలీస్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ మేరకు వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో కలెక్టర్ హరిత పర్యటించారు. స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్ట్ ను పరిశీలించారు.
రోడ్లపై తిరిగితే కఠినంగా వ్యవహరించండి: కలెక్టర్ హరిత - latest news on Collector Haritha visited police check post at narsampeta in warangal district
అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారి హరిత పోలీసులను ఆదేశించారు. నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్ట్‌ను పరిశీలించారు.
రోడ్లపై తిరిగితే కఠినంగా వ్యవహరించండి: కలెక్టర్ హరిత
అనవసరంగా తిరుగుతున్న వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. లాక్‌డౌన్ పట్ల ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు కోసం బాలాజీ, జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలను కలెక్టర్ పరిశీలించారు.
ఇదీ చూడండి:ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ మార్గదర్శకాలివే...