తెలంగాణ

telangana

ETV Bharat / state

బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవు :కలెక్టర్​ - కలెక్టర్​ హరిత వార్తలు

బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని వరంగల్​ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత వైద్యులను హెచ్చరించారు. వర్ధన్నపేట, రాయపర్తి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

haritha
కలెక్టర్​ హరిత

By

Published : May 20, 2021, 8:43 AM IST

వరంగల్​ గ్రామీణ జిల్లాలో కొవిడ్​ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​ హరిత వైద్యులకు సూచించారు. బాధితులకు అందుబాటులో ఉంటూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. వర్ధన్నపేట, రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్​ ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

ఆస్పత్రి ప్రాంగణం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. ఆస్పత్రి నిర్వహణ, వైద్యులపై బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చూడండి:'ఉ.10 గంటల తర్వాత బయటకు వచ్చేవారి వాహనాలు స్వాధీనం'

ABOUT THE AUTHOR

...view details