వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలంలో పల్లె ప్రగతి, మరుగుదొడ్లు నిర్మాణం, అభివృద్ధి పనులపై కలెక్టర్ హరిత సమీక్ష సమావేశం నిర్వహించారు. హరితహారం పనులు పూర్తి స్థాయిలో కాకపోవడం వల్ల అధికారులపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
పనుల్లో జాప్యం చేస్తే... కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్ - నడికూడ మండలంలో అభివృద్ధి పనులపై కలెక్టర్ హరిత సమీక్ష సమావేశం
అభివృద్ధి పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత హెచ్చరించారు. నడికూడ మండలంలో అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
పనుల్లో జాప్యం చేస్తే... కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్
అభివృద్ధి కార్యక్రమాల్లో జాప్యం చేస్తే సహించేది లేదన్నారు. కఠిన చర్యలు తీసుకునే పరిస్థితి తీసుకురావద్దని అధికారులు, సర్పంచులను హెచ్చరించారు.