తెలంగాణ

telangana

ETV Bharat / state

అలసత్వం వద్దు.. పనులు పూర్తి చేయండి: కలెక్టర్​ హరిత - పల్లె ప్రగతి పనులను పరిశీలించిన కలెక్టర్​ హరిత

వరంగల్​ గ్రామీణ జిల్లాలోని పలు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్​ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు వేదికల నిర్మాణంలో అలసత్వం వహించరాదంటూ ఆమె హెచ్చరించారు. పెండింగ్​లో ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.

collector haritha inspection on pallepragathi works at warangal ural district
అలసత్వం వద్దు.. పనులు పూర్తి చేయండి: కలెక్టర్​ హరిత

By

Published : Oct 21, 2020, 7:07 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు వేదికల నిర్మాణం, శ్మశాన వాటిక, డంపింగ్​ యార్డు, విలేజ్ పార్కు నిర్మాణాలను కలెక్టర్​ హరిత పరిశీలించారు. జిల్లాలోని పర్వతగిరి, సంగేమ్​ మండలాల్లోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పనులను పరిశీలిస్తున్న కలెక్టర్​ హరిత

రైతు వేదికల నిర్మాణంలో అలసత్వం వహిస్తే సహించేదిలేదని కలెక్టర్​ హెచ్చరించారు. పర్వతగిరి మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నత్తనడకన జరగడం పట్ల సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులపై కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో అలసత్వం వహిస్తే సస్పెండ్​ చేస్తామని హరిత తెలిపారు.

ఇదీ చదవండిఃరాంపూర్​ శివారులో మంత్రి హరీశ్​ రావు వాహనం తనిఖీ

ABOUT THE AUTHOR

...view details