వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుకొండ, దుగ్గొండి, నర్సంపేట మండలంలో కలెక్టర్ ఎం హరిత విస్తృతంగా పర్యటించారు. ఆయా మండలాల్లోని రైతు వేదిక నిర్మాణాలను, విలేజ్ పార్కులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గీసుగొండ మండలంలోని విశ్వనాథపురం, కొనయిమాకులలో రైతు వేదిక నిర్మాణ పనులు 5 రోజుల్లో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పనితీరు మార్చుకోవాలని పంచాయతీ సెక్రటరీపై జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. దస్రుతండాలోని విలేజ్ పార్కును పరిశీలించి చూడటానికి ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ హరిత ఆకస్మిక తనిఖీ... అధికారులపై అసహనం - collector haritha visit updates
వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుకొండ, దుగ్గొండి, నర్సంపేట మండలంలో కలెక్టర్ ఎం హరిత పర్యటించారు. రైతు వేదిక నిర్మాణాలను, విలేజ్ పార్కులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు వేదికలను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ హరిత ఆకస్మిక తనిఖీ... అధికారులపై అసహనం
అనంతరం కొమ్మాలలో జరుగుతున్న రైతు వేదికను పరిశీలించారు. అక్కడ నుంచి దుగ్గొండి మండలంలోని మందపల్లి రైతు వేదిక పనులను పర్యవేక్షించారు. త్వరతగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో జరుగుతున్న రైతువేదిక భవనాన్ని పరిశీలించి పనులు వేగంగా జరగాలని రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సంపత్ రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.