తెలంగాణ

telangana

ETV Bharat / state

Snake in Rajanna Temple: రాజన్న గుడిలో నాగన్న హడావుడి... - Telangana news

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని రాజన్న ఆలయంలో నాగుపాము హడావుడి చేసింది. గుడిలో బుసలు కొడుతూ కలియతిరిగింది. సుమారు రెండుమూడు గంటల పాటు అక్కడే ఉన్నట్లు భక్తులు చెప్పారు.

Rajanna
రాజన్న

By

Published : Sep 14, 2021, 7:03 PM IST

వరంగల్ జిల్లాలోని ఓ ప్రముఖ దేవాలయంలో నాగుపాము హల్​చల్ చేసింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి (Rajanna Temple) వారి ఆలయంలోకి ఆరడుగుల నాగుపాము బుసలు కొడుతూ గుడిలో ప్రవేశించింది. గుడిలోపల భాగంలో నాగుపాము కలియతిరగడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు.

ప్రధాన ఆలయంలో సుమారు మూడు గంటలపాటు హడావుడి చేసిన సర్పం... తరువాత పక్కన పొలాల్లోకి వెళ్లిపోయింది. ఇది స్వామి వారి మహిమే అని అర్చకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నాగపాము గుడిలో ఉన్నంతసేపు భక్తులు ఆసక్తిగా తిలకించారు.

రాజన్న గుడిలో నాగన్న హడావుడి...

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details