లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ - nadikuda mandal news
కరోనా దృష్ట్యా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలంలోని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రజాప్రతినిధులు ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు నేతలు తెలిపారు.
cm relief fund cheques distributed in nadikuda mandal
వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలంలోని లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రజాప్రతినిధులు అందజేశారు. లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఇళ్లకు వెళ్లి మరీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మచ్చ అనసూర్య రవీందర్, జడ్పీటీసీ కోడపాక సుమలత కర్ణాకర్, తెరాస నడికుడ మండల అధ్యక్షులు భీముడి నాగిరెడ్డి, తెరాస వైస్ ఎంపీపీ చందకుమార్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు సాంబశివ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.