తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్ష్మీపూర్​లో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం - పరకాల మండలం లక్ష్మీపూర్​లో కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం

ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలుకేంద్రం ఏర్పాటు చేసి.. చివరి ధాన్యం గింజను సైతం కొనుగోలు చేసిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందని పరకాల వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్​ రమేశ్​ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా లక్ష్మీపూర్​లో కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

CM KCR credited with the purchase of the last grain nut
లక్ష్మీపూర్​లో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

By

Published : Jun 17, 2020, 4:05 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం లక్ష్మీపూర్​లో కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు భిక్షపతి, వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్​ రమేశ్​లు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ కరోనావైరస్​పై ప్రజలను అప్రమత్తం చేస్తూనే.. రైతులకోసం నిరంతరం శ్రమిస్తున్నారని భిక్షపతి కొనియాడారు. రైతులకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున పంట సాయం అందిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి.. చివరి ధాన్యం గింజను సైతం కొనుగోలు చేసిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందని వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్​ రమేశ్​ అన్నారు. ఈకార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు అశోక్, పరకాల మండలం వైస్ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సురేశ్​, భిక్షపతి, తెరాస గ్రామ కమిటీ అధ్యక్షులు రాజు, కార్యదర్శి రాజయ్య, స్థానిక తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ముఖ్యమంత్రులతో రెండో రోజు మోదీ భేటీ

ABOUT THE AUTHOR

...view details