తెలంగాణ

telangana

ETV Bharat / state

జై బోలో మట్టి గణపతికి.. జై అంటున్న చిన్నారులు - జై బోలో మట్టి గణపతికి.. జై అంటున్న చిన్నారులు

వరంగల్ గ్రామీణ జిల్లా పరిషత్​ పాఠశాల విద్యార్థులు మట్టితో తయారుచేసిన విగ్రహాలను కలెక్టరేట్​తో ప్రదర్శించారు. మట్టి గణపతినే పూజించండంటూ ప్రజలకు అవగాహన కల్పించారు.

జై బోలో మట్టి గణపతికి.. జై అంటున్న చిన్నారులు

By

Published : Aug 26, 2019, 3:35 PM IST

చిన్నారులు చిట్టి చిట్టి చేతులతో మట్టిగణపతులను తయారు చేశారు. వినాయక చవితి పర్వదినాన మట్టి వినాయకుడినే పూజించమంటూ వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ.. మట్టి గణపయ్య వాడకంపై అవగాహన పెంచేందుకు మట్టితో తయారు చేసిన విగ్రహాలను పాలనాధికారి హరిత ఆధ్వర్యంలో కలెక్టరేట్​లో ప్రదర్శించారు. ఉపాధ్యాయులు, పిల్లల కృషిని హరిత అభినందించారు. జిల్లాలో నీటి వనరులు కలుషితం కాకుండా అందరూ మట్టి విగ్రహాలనే పూజించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

జై బోలో మట్టి గణపతికి.. జై అంటున్న చిన్నారులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details