ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కచ్చలూరు పడవ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ప్రమాదంలో మరణించిన వరంగల్ గ్రామీణ జిల్లా కడిపికొండకు చెందిన మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ చెక్కులు అందించారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు 15లక్షల రూపాయల చెక్కులు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
కచ్చలూరు మృతుల కుటుంబాలకు చెక్కుల అందజేత - cheques distribution for kachaluru boat accident victims families
కచ్చలూరు పడవ ప్రమాద మృతుల కుటుంబాలకు వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చెక్కులు అందజేశారు. 18లక్షల రూపాయల ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ చేశారు. బాధితులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కచ్చలూరు మృతుల కుటుంబాలకు చెక్కుల అందజేత