తెలంగాణ

telangana

ETV Bharat / state

చైన్​స్నాచింగ్ కేసు.. 24 గంటల్లో సుఖాంతం - పరకాల చైన్​స్నాచింగ్ కేసు

ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, ప్రభుత్వం చేపట్టిన ప్రచారం ఫలితాలనిస్తోంది. వరంగల్​ రూరల్ జిల్లాలో చైన్​స్నాచింగ్​ కేసును సీసీ కెమెరాల సాయంతో పోలీసులు 24 గంటల్లో ఛేదించారు.

24 గంటల్లో సుఖాంతం

By

Published : Sep 29, 2019, 11:09 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం లక్ష్మిపురం గ్రామంలో శనివారం సాయంత్రం జరిగిన చైన్ స్నాచింగ్​ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకున్నట్లు పరకాల పోలీసులు తెలిపారు. చైన్​ స్నాచింగ్​కు పాల్పడింది పాత నేరస్థులు కొండేటి మహేశ్​, ఎల్దండి అరుణ్​గా నిర్ధారించారు. నేరం చేసి పోలీసుల డేగ కన్నుల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని నేరస్థులను పోలీసులు హెచ్చరించారు. తల్లి దండ్రుల పర్యవేక్షణ కొరవడి.. జల్సాలకు అలవాటుపడిన కొంతమంది యువకులు ఈవిధంగా నేరాలు చేస్తున్నారని తెలిపారు. నేరస్థులతో పోరాడిన విధానాన్ని బాధిత మహిళ 65 సంవత్సరాల 'లక్ష్మిసాయం'ను పోలీసులు మెచ్చుకున్నారు.

చైన్​స్నాచింగ్ కేసు సుఖాంతం

ABOUT THE AUTHOR

...view details