తెలంగాణ

telangana

ETV Bharat / state

Kishan reddy: 'అవసరమైతే కేసీఆర్​కు ఆ విషయంపై లేఖ రాస్తాను' - hanamkonda news

పద్మాక్షి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (central minister kishan reddy) రాష్ట్ర ప్రభుత్వాన్ని (TRS Government) కోరారు. అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాస్తానని స్పష్టం చేశారు. హనుమకొండ పద్మాక్షి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Kishan reddy
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

By

Published : Oct 26, 2021, 2:21 PM IST

హనుమకొండలోని పద్మాక్షి అమ్మవారి ఆలయ (padmakshi ammavari temple) అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (central minister kishan reddy) కోరారు. ఆలయ (padmakshi ammavari temple) అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేయాలని సూచించారు. అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్​కి లేఖ రాస్తానని తెలిపారు. హనుమకొండలోని పద్మాక్షి అమ్మవారి (padmakshi ammavari temple) ని దర్శించుకున్నారు. అనంతరం కిషన్​రెడ్డి (central minister kishan reddy) ప్రత్యేక పూజలు చేశారు.

పెద్ద ఎత్తున యువత దేవాలయాలను సందర్శిస్తున్నారని.. ఇది మంచి పరిణామమని కిషన్‌రెడ్డి (central minister kishan reddy) పేర్కొన్నారు. ఒకప్పుడు వృద్ధులు మాత్రమే ఎక్కువగా దేవాలయాలకు వెళ్లేవారని.. మంచి మార్గంలో ప్రయాణించాలని యువత పూజలు చేయడం అభినందించాల్సిన విషయమని కిషన్‌రెడ్డి (central minister kishan reddy) తెలిపారు.

ఇదీ చూడండి:Huzurabad by election campaign Viral Video: 'తెరాసకు ఓటు వేయకపోతే పింఛను నిలిపివేస్తాం'

ABOUT THE AUTHOR

...view details