ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ వెంకట లక్ష్మి పేర్కొన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగెం, కుంటపల్లి గ్రామాలల్లో ఏర్పాటు చేసిన 42 సీసీ కెమెరాలను ఆమె ప్రారంభించారు.
'ఆ.. ఒక్కటి వంద మంది పోలీసులతో సమానం' - telangana latest updates
వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండల పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అన్ని గ్రామాల్లోని ప్రజలు నేర నియంత్రణలో పోలీసులతో కలసి రావాలని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ వెంకట లక్ష్మి కోరారు.
సీసీకెమెరాల ప్రారంభం
ఈ కార్యక్రమంలో సీసీ కెమెరాల ఆవశ్యకతను ప్రజలకు వివరించి.. ప్రజలందరూ నేరాల నియంత్రణకు కలిసి రావాలన్నారు.