పోలీసు ఎస్కార్ట్‌తో ఆర్టీసీ బస్సు రైట్ రైట్..! - Buses limited to the depot in Warangal district
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ బంద్ పిలుపు మేరకు వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. వరంగల్ జిల్లా పరకాలలో పోలీసులు బస్సులను నడిపించాలని ఎస్కార్ట్ కల్పించి ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు.
ఆర్టీసీ బస్సుకు పోలీసు ఎస్కార్ట్
వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ కారణంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం 9 గంటల వరకు ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. అనంతరం 4 బస్సులను పోలీసులు భారీ బందోబస్తు మధ్య నడిపించే ప్రయత్నం చేశారు. బంద్ కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆర్టీసీ కార్మికులను ముందస్తుగా అరెస్టు చేశారు.
TAGGED:
డిపోలకే పరిమితమైన బస్సులు