తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆకేరు వాగుపై వంతెన నిర్మాణానికి రంగం సిద్ధం! - ఎమ్మెల్యే ఆరూరి రమేష్

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలోని ఆకేరు వాగుపై వంతెన నిర్మించడానికి అధికారులు రంగం సిద్దం చేశారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్​తో అధికారులు చర్చించారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని వంతెన నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచనలు చేశారు.

Bridge Construction Started In Akeru Stream
ఆకేరు వాగుపై వంతెన నిర్మాణానికి రంగం సిద్ధం!

By

Published : May 24, 2020, 8:19 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలోని ఆకేరు వాగుపై వంతెన నిర్మాణానికి రంగం సిద్ధమైంది. స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్​తో అధికారులు మంతనాలు జరిపారు. అధికారులతో కలిసి ఎమ్మెల్యే వంతెన నిర్మాణం జరిపే ప్రాంతాన్ని సందర్శించారు.

రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచనలు చేశారు. ఆకేరు వాగుపై వంతెన నిర్మాణానికి అధికార యంత్రాంగం కదలడం వల్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:గ్రేటర్​లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details