తెలంగాణ

telangana

ETV Bharat / state

అరుదైన సంఘటన... బోరు వేయకుండానే పైకివస్తున్న పాతాళగంగ - మోటారు వేయకుండానే ఉబికివచ్చిన నీరు

విద్యుత్ సరఫరా లేకుండానే ఓ రైతు వ్యవసాయ బోరు నుంచి నీరు ఉబికి వచ్చింది. మూడు రోజులుగా ఇదే విధంగా బోరు నుంచి నీరు వస్తుందని రైతు తెలిపాడు. విషయం తెలుసుకున్న స్థానికులు బోరు వద్దకు చేరుకొని తిలకించారు.

BORE
BORE

By

Published : Aug 18, 2020, 11:55 AM IST

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం జగన్నాథపల్లిలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. మోటారు వేయకుండానే బోరు నుంచి నీరు ఉబికి వచ్చింది. గత ఆరు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి భూగర్భ జలాలు పెరగడంతో గూడెల్లి ఉప్పులయ్య అనే రైతు బోరు నుంచి నిరంతరాయంగా నీరు వస్తోంది.

అరుదైన సంఘటన... బోరు వేయకుండానే పైకివస్తున్న పాతాళగంగ

మూడు రోజులుగా ఇదే విధంగా బోరు నుంచి నీరు వస్తుందని రైతు తెలిపాడు. కరెంట్ లేకున్నా ఇలా నీరు రావడం పట్ల రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు బోరు వద్దకు చేరుకొని తిలకిస్తూ సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయారు.

ఇదీ చదవండి: ఉగ్ర గోదావరి.. కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details