ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం - warangal news
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వరంగల్ గ్రామీణ మండలం సంగెం మండలం ఆశాలపల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సీపీ ప్రమోద్‌కుమార్... ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
![ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8721289-1031-8721289-1599544154247.jpg)
వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సంగెం మండలం ఆశాలపల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. రక్తదాన శిబిరాన్నిప్రారంభించిన సీపీ ప్రమోద్ కుమార్... ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ధర్మారెడ్డితో కేక్ కట్ చేపించారు. అనంతరం రెడ్ క్రాస్ ఛైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు మొదటగా రక్తాదానం చేశారు.
రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న ఎంతో మందిని కాపాడవచ్చని సీపీ అభిప్రాయపడ్డారు. జిల్లాలో విశిష్ట సేవలందిస్తున్న రెడ్‌క్రాస్ నిర్వాహకులను అభినందించారు. పెద్ద ఎత్తున యువత రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, స్టేట్ ఈసీ మెంబెర్ ఈవీ శ్రీనివాస్ రావు,మండల ప్రజాప్రతినిధులు, అధికారులు,తెరాస నాయకులు, పాల్గొన్నారు