వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పోలీస్స్టేషన్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ శిబిరాన్ని సీఐ కరుణసాగర్ రెడ్డి ప్రారంభించారు. ఈనెల 21 వరకు పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ రోజుకో కార్యక్రమం నిర్వహిస్తామని సీఐ తెలిపారు. పోలీసులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న మరొకరి ప్రాణాన్ని కాపాడాలని సీఐ సూచించారు.
నర్సంపేటలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు - blood donation camp by narsampet police in the eve of police commemoration day
పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో పోలీసులు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
నర్సంపేటలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు