ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పీహెచ్సీలో రక్తనిధి కేంద్రాన్ని.. జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. నర్సంపేట ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ సెంటర్ కూడా అందుబాటులో ఉందని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. కేసీఆర్ చొరవతో సర్కారు ఆస్పత్రుల్లో ఆధునాతన సౌకర్యాలు ఏర్పాటుచేయగలుగుతున్నామని జిల్లా పరిషత్ ఛైర్‌పర్స్‌న్ గండ్ర జ్యోతి అన్నారు. ఈ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందని.. రూ. 40 కోట్లతో మరో నూతన భవనాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
నర్సంపేట పీహెచ్సీలో రక్తనిధి కేంద్రం ప్రారంభం - ZP CHAIRPERSON GANDRA JYOTHI
నర్సంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జడ్పీ ఛైర్మన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ఎంపీ మాలోత్ కవిత ప్రారంభించారు.
నర్సంపేట పీహెచ్సీలో రక్తనిధి కేంద్రం ప్రారంభం