గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రధానమంత్రి మోదీ చేసి చూపిస్తున్నారని భాజపా రాష్ట్ర నాయకులు ప్రదీప్‌రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో గాంధీజీ సంకల్ప యాత్ర నిర్వహించారు. గ్రామాల్లో స్వచ్ఛత, మద్యనిషేధం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తూ.. గ్రామస్వరాజ్యం కోసం మోదీ కృషి చేస్తున్నారన్నారు. గాంధీజీ పేరుతో పార్టీ ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఆయన ఆశయాలను మాత్రం విస్మరించారని రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. సంకల్ప యాత్రలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తోపాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
గ్రామ స్వరాజ్యానికి మోదీ కృషి: ప్రదీప్‌రావు - Bjp sankalp yatra at narsampet
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో భాజపా ఆధ్వర్యంలో గాంధీజీ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర నాయకులు ప్రదీప్‌రావు పాల్గొన్నారు.
![గ్రామ స్వరాజ్యానికి మోదీ కృషి: ప్రదీప్‌రావు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4949939-thumbnail-3x2-df.jpg)
నర్సంపేటలో భాజపా సంకల్ప యాత్ర