తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓటు బ్యాంకు కోసమే ఎంఐఎంతో తెరాస పొత్తు' - warangal news

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. నిజాం నిరంకుశ రాజుల చేతిలో ప్రాణాలొదిలిన అమరవీరులకు నివాళులర్పించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్ఐఎంతో పొత్తు పెట్టుకున్నారని బండి సంజయ్​ ఆరోపించారు.

bjp mp bandi sanjay kumar visited in parakala
'ఓటు బ్యాంకు కోసమే ఎంఐఎంతో తెరాస పొత్తు'

By

Published : Sep 9, 2020, 10:06 AM IST

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీతో తెరాస పొత్తు పెట్టుకోవటం బాధాకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కుమార్​ తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో పర్యటించిన సంజయ్​.. అమరధామంలో అమరవీరులకు నివాళులర్పించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్ఐఎంతో పొత్తు పెట్టుకున్నారని బండి సంజయ్​ ఆరోపించారు.

సీఎం కేసీఆర్ హిందూ వ్యతిరేకిగా ప్రవర్తిస్తున్నాడన్నారు. రాష్ట్రంలో హిందువుల పండగలను సీఎం అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తెరాస అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్​... ఇప్పుడు ఎందుకు నిర్వహించడం లేదో తెలపాలని డిమాండ్ చేశారు.

'ఓటు బ్యాంకు కోసమే ఎంఐఎంతో తెరాస పొత్తు'
'ఓటు బ్యాంకు కోసమే ఎంఐఎంతో తెరాస పొత్తు'

ఇదీ చదవండి:రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను నియమించిన ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details