తెరాస అభ్యర్థికి గెలుపు మీద నమ్మకం లేక.. ఎన్నికల్లో డబ్బు పంచడానికి సిద్ధమయ్యారంటూ భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో ఏర్పాటైన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం.. నిరుద్యోగులకు చేసిందేంటో వివరించాలని నిలదీశారు. నిరుద్యోగ భృతి ఎందుకివ్వడం లేదో తెలపాలని డిమాండ్ చేశారు.
'తెరాస వల్ల నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదు' - వరంగల్ గ్రామీణ జిల్లా
ప్రభుత్వం.. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి మండిపడ్డారు. విమర్శలకు సమాధానమివ్వలేకే.. భాజపా నాయకుల ఇళ్లపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు. పరకాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

'తెరాస వల్ల నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదు'
కాకతీయ యూనివర్సిటీలో 500 మంది ఉద్యోగుల అవసరం ఉండగా.. కేవలం 100మంది మాత్రమే పని చేసే దుస్థితి ఉందని ప్రేమేందర్ రెడ్డి వివరించారు. ఉద్యోగులకు సమయానికి జీతాలివ్వని ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఒకటేనంటూ ఎద్దవా చేశారు. విమర్శలకు సమధానమివ్వలేకే.. భాజపా నాయకుల ఇళ్లపై ప్రభుత్వం దాడులు చేయిస్తోందని ఆరోపించారు.
ఇదీ చదవండి:మంత్రి వేధిస్తున్నారంటూ... ఉన్నతాధికారి కన్నీటి పర్యంతం