తెలంగాణ

telangana

ETV Bharat / state

'మా అభ్యర్థులను భయపెట్టడం మానుకోండి' - భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ భారీ ర్యాలీ

భాజపా అభ్యర్థులను భయపెట్టే కార్యక్రమాలను అధికార పార్టీ మానుకోవాలని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. పరకాలలో కమల అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు.

bjp mla rajasingh pracharam in parakala
'మా అభ్యర్థులను భయపెట్టడం మానుకోండి'

By

Published : Jan 17, 2020, 3:23 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ భారీ ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆయన ప్రచారం చేపట్టారు.
అధికార పార్టీ భాజపా అభ్యర్థులను భయపెట్టే కార్యక్రమాలు చేస్తుందని... వాటిని తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించారు. పరకాలలోని భాజాపా కార్యకర్తల వెన్నంటి తాను ఉన్నానని అభయమిచ్చారు. ప్రశ్నించే గొంతు కోసం పోటీ చేస్తున్న నలుగురు అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

'మా అభ్యర్థులను భయపెట్టడం మానుకోండి'

ABOUT THE AUTHOR

...view details