వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలంలో భాజపా నాయకులు ధర్నా చేపట్టారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎన్నికల పోలింగ్లో తెరాస నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ వారు పోలింగ్ కేంద్రం సమీపంలో టెంట్ వేసి మద్యం, డబ్బులు పంచుతున్నారని చెప్పారు.
డబ్బులు పంచుతున్నారని భాజపా ఆందోళన - వరంగల్ రూరల్ జిల్లా తాజా వార్తలు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎన్నికల పోలింగ్లో తెరాస నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలంలో భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీ వారు టెంట్ వేసి మద్యం, డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు.
![డబ్బులు పంచుతున్నారని భాజపా ఆందోళన bjp leaders protest at duggondi in warangal rural district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11004305-thumbnail-3x2-dsr.jpg)
డబ్బులు పంచుతున్నారని భాజపా ఆందోళన
ఓటర్లను ప్రలోభపెడుతున్నారని.. రిటర్నింగ్ అధికారి వచ్చి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్సై ఆందోళనకారులతో మాట్లాడి.. ధర్నా విరమింపజేశారు.
ఇదీ చదవండి:'నేను కేసీఆర్ను కలవలేదు... తప్పుడు ప్రచారమన్న కోదండరాం'