తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా ప్రతినిధి బృందాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు - jayashanker bhupalpally news

మల్లారంలో హత్యకు గురైన రాజబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న భాజపా ప్రతినిధి బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ మీదుగా వెళ్తున్న నాయకులను... వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల శివారులో పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

భాజపా ప్రతినిధి బృందాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
భాజపా ప్రతినిధి బృందాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

By

Published : Jul 29, 2020, 8:09 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మల్లారంలో హత్యకు గురైన రాజబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న భాజపా ప్రతినిధి బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాయకులు హైదరాబాద్ మీదుగా మల్లారం వెళ్తుండగా... వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల శివారులో పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టయిన వారిలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుగారు, శాసనమండలి సభ్యులు ఎన్ రామచందర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి, గుజ్జల ప్రేమేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజల ప్రాణాలు గాలికొదిలేసి.. ధనార్జనే ధ్యేయంగా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని నాయకులు విమర్శించారు. గ్రామాల్లో తెరాస నాయకులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించటమో... లేదా రాజకీయ హత్యలు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

ఇవీ చూడండి:గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స

ABOUT THE AUTHOR

...view details