వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా గ్రామాల్లోకి వచ్చి గాయాల పాలు చేస్తున్నాయి. తీవ్రమైన కోతుల బెడద నుంచి తమను కాపాడాలని కోరుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. జనవాసాల్లోకి వానరాలు అధిక మొత్తంలో చేరుకోవడం ఇబ్బందిగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయపర్తి మండలంలోని రాయపర్తి, కొండూరు, తీర్మాలయపల్లి, కొండాపురం, మైలారం గ్రామాల్లో కోతుల బెడద తీవ్రమైంది. ఇప్పటికైనా వాటి నుంచి తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
నరుడిని భయపెడుతున్న వానరాలు - bhibastham-srustisthunna-kothulu
అడవుల్లో ఉండాల్సిన వానరాలు గ్రామాల్లోకి వచ్చి రచ్చరచ్చ చేస్తున్నాయి.వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి.
నరుడిని భయపెడుతున్న వానరాలు