విద్యార్థులపై తేనెటీగలు దాడి చేసిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో చోటు చేసుకుంది. గీసుకొండ మండలం ధర్మారంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులపై ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడి చేయటం వల్ల పలువురు విద్యార్థులు గాయపడ్డారు.
విద్యార్థులపై తేనెటీగల దాడి - Bees Attack on Students at Dharmaram school
వరంగల్ గ్రామీణ జిల్లా ధర్మారంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
విద్యార్థులపై తేనెటీగల దాడి
గాయపడినవారిని హుటాహుటిన పోలీసు వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తేనెటీగల దాడి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇవీ చూడండి:అక్కడ డబ్బులు ఉతికేస్తున్నారు