తెలంగాణ

telangana

ETV Bharat / state

'పండుగ రోజు ప్రతిఒక్కరు బతుకమ్మ చీర ధరించాలి'

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆడపడచులకు అందిస్తున్న బతుకమ్మ చీరలను ప్రతిఒక్కరు ధరించాలని వరంగల్ గ్రామీణ జిల్లా పాలనాధికారి హరిత అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

bathukamma-sarees-distribution-in-warangal-rural-dist-by-minister-yerraabelli
'పండుగ రోజు ప్రతిఒక్కరు బతుకమ్మ చీర ధరించాలి'

By

Published : Oct 10, 2020, 3:23 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో బతుకమ్మ చీరలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జిల్లా పాలనాధికారి హరిత పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు అందిస్తున్న ఈ కానుక ఎంతో విలువైందని కలెక్టర్ ప్రశంసించారు. పండుగ రోజు ప్రతిఒక్కరు బతుకమ్మ చీరలను ధరించాలని మహిళలను విజ్ఞప్తి చేశారు.

ప్రతి చీర తయారీ వెనుక నేతన్నల శ్రమ దాగి ఉందన్నారు. పండుగ రోజు వాటిని ధరిస్తేనే వారి కష్టానికి అసలైన ప్రతిఫలం దక్కుతుందన్నారు. పండగపూట కొత్త చీరలు అందించాలన్న నిర్ణయం ప్రభుత్వ సదుద్దేశానికి నిదర్శనమని పాలనాధికారి హరిత పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'సీఎం కేసీఆర్​కు తెలంగాణ ఆడపడుచుల సంతోషమే ముఖ్యం'

ABOUT THE AUTHOR

...view details