కరోనా నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మంత్రి ఎర్రబెల్లి నివాసంలో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో కలసి సద్దుల బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు.
సద్దుల బతుకమ్మ సంబురాల్లో మంత్రి ఎర్రబెల్లి - బతుకమ్మ సంబురాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో కలిసి ఆయన నివాసంలోనే వేడుకల్లో పాల్గొన్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు పండుగ జరుపుకోవాలని సూచించారు.
![సద్దుల బతుకమ్మ సంబురాల్లో మంత్రి ఎర్రబెల్లి bathukamma celebrations at mla errabelli dayakar rao home in warangal rural district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9299279-1064-9299279-1603544870283.jpg)
సద్దుల బతుకమ్మ సంబురాల్లో మంత్రి ఎర్రబెల్లి
కరోనా దృష్ట్యా ఇంటి వద్దే బతుకమ్మను పేర్చి కుటుంబ సభ్యులతో ఆడిపాడారు.