తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి - Awareness seminar was held on the cultivation of monsoon crops at Parakala town

అన్నదాతలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. నియంత్రిత పంటలసాగు ద్వారా రైతులను ఆర్థికంగా ఎదగటానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు.

Awareness seminar was held on the cultivation of monsoon crops at Parakala town in Warangal rural district.
రైతులకు అండగా ఉంటాం

By

Published : May 28, 2020, 7:00 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వానాకాలం పంటల సాగు ప్రణాళికపై అవగాహన సదస్సును నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ సూచనల మేరకు నిర్దేశించిన పంటలను రైతులు వేయాలని సూచించారు. అన్నదాతలను ఆర్థికంగా ఎదగటానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్​ను ప్రభుత్వం రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details