తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓరుగల్లు పోలీస్​ ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమం - ఓరుగల్లు పోలీస్​ ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమం

ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ.. ఓరుగల్లులో జాగృతి పోలీస్ కళాబృందం సభ్యులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అక్షరాస్యత, డయల్ 100,  మూఢ నమ్మకాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు, చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Art program under the direction of Orugalla Police
ఓరుగల్లు పోలీస్​ ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమం

By

Published : Jan 23, 2020, 9:26 PM IST

వరంగల్ రూరల్ జిల్లాలో సాంకేతిక అంశాలపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జాగృతి పోలీస్ కళాబృందం సభ్యులు సూచించారు. శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో జాగృతి పోలీస్ కళాజాత బృందం వరంగల్ సీపీ విశ్వనాథ రవీందర్ ఆదేశాల మేరకు వివిధ అంశాలపై 8 మంది సభ్యులు కళాజాత నిర్వహించారు.

ఈ సందర్భంగా అక్షరాస్యత, డయల్ 100, మూఢ నమ్మకాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు, చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మద్యం మత్తులో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచించారు.

ఓరుగల్లు పోలీస్​ ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమం

ఇవీ చూడండి: ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details