తెలంగాణ

telangana

ETV Bharat / state

హరితహారం మొక్కలను పరిశీలించిన ఏపీడీ వసుమతి - వరంగల్​ వార్తలు

ఈ నెల 25న ప్రారంభం కానున్న ఆరో విడత హరితహారం కార్యక్రమంలో నాటే మొక్కలను వరంగల్​ గ్రామీణ జిల్లా అధికారులు పరిశీలించారు. ఈ మేరకు వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఏపీడీ వసుమతి మొక్కలను పరిశీలించారు. హరితహారానికి సరిపడా మొక్కలున్నాయా అని ఆరా తీశారు.

APD Vasumathi Inspects Haritha Haram Plants
హరితహారం మొక్కలను పరిశీలించిన ఏపీడీ వసుమతి

By

Published : Jun 23, 2020, 1:04 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా అధికారులు ఈ నెల 25న ప్రారంభం కానున్న ఆరో విడత హరితహారానికి జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని నర్సరీలో మొక్కలను ఏపీడీ వసుమతి పరిశీలించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేయడానికి సరిపడా మొక్కలున్నాయా అని నర్సరీ నిర్వాహకులను ఆరా తీశారు. నర్సరీలోని ప్రతి మొక్కను నాటేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హరితహారంలో అత్యధిక మొక్కలు నాటి, వాటిని సంరక్షించి రాష్ట్రంలో వరంగల్​ గ్రామీణ జిల్లాను ఆదర్శంగా నిలపాలని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details