మూగ జీవాల రోదన పాలకులకు పట్టదన్నట్లుగా మారింది. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో పశు వైద్యశాల కోసం భవనం లేక.. అంగన్ వాడీ కేంద్రం కోసం నిర్మించిన భవనాన్ని వినియోగిస్తున్నారు. ఆ భవనంలో వసతులు లేక వైద్యం నిమిత్తం వచ్చే రైతులతో పాటు వైద్య సిబ్బంది కూడా అవస్థల పాలవుతున్నారు. రాయపర్తి మండలంలో 9 వేల గేదెలు, 10 వేల ఆవులు, 45 వేల గొర్రెలు ఉన్నాయి.
పశువైద్యశాల లేక ఇబ్బంది పడుతున్న రైతులు - building
రాయపర్తిలో పశు వైద్యశాల లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. అంగన్వాడీ కేంద్ర భవనాన్నే ఆసుపత్రిగా వినియోగించుకుంటున్నారు. ఆ భవనంలో వసతులు సరిగాలేక రైతులతో పాటు వైద్యులూ ఇబ్బందులు పడుతున్నారు.
![పశువైద్యశాల లేక ఇబ్బంది పడుతున్న రైతులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3072784-thumbnail-3x2-hospitaljpg.jpg)
పశువైద్యశాల లేక ఇబ్బంది పడుతున్న రైతులు