'వేసవిలో గుబులు పుట్టిస్తున్న టమాట' - 50
ఎండలతో ఉష్ణోగ్రతలే కాదు..కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. కిలో టమాట ధర 50 రూపాయలు పలుకుతోంది.

పెరిగిన టమాటా ధరలు
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని కిలో టమాట 50 రూపాయలు పలుకుతుంది. దీంతో కొనుగోలుదారులు అయోమయానికి గురవుతున్నారు. ధరలు ఆకాశాన్ని అంటుతుంటే కొనేదెలా అంటూ వాపోతున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో వీటి ధర మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే..ఇక ముందుముందు పరిస్థితి ఏంటని జనాలు పరేషాన్ అవుతున్నారు.
పెరిగిన టమాట ధరలు