Love marriage: హనుమకొండ జిల్లాకు చెందిన అరవింద్‌రెడ్డి, అమెరికాకు చెందిన జెన్న బ్లెమర్ వివాహం ఘనంగా జరిగింది. ఖండాలు దాటిన వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడంతో వీరి ప్రేమ పెళ్లిపీటలు ఎక్కింది. హనుమకొండకు చెందిన పుట్ట అనిత మోహన్ రెడ్డి దంపతుల కుమారుడు అరవింద్ రెడ్డిపై చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. అక్కడ డాక్టర్ జెన్న బ్లెమర్ పరిచయం అయింది. ఆనంతరం ఒకరికి ఒకరు ఇష్టపడ్డారు.
ఈ విషయాన్ని ఇరువురు తల్లిదండ్రులకు చెప్పగా వారు అంగీకరించారు. హనుమకొండలో జరిగిన వీరి వివాహానికి పలువురు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. పెళ్లిలో తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులు ధరించిన జెన్న బ్లెమర్... ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అరవింద్ రెడ్డిని పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని జెన్న బ్లెమర్ తెలిపింది.