వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో వరద ఉద్ధృతికి నష్టపోయిన పంటలను వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించారు. పంటల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు సాయం అందేలా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
పంట నష్టంపై అధికారుల అభయం - తెలంగాణ తాజా వార్తలు
భారీ వర్షాలు, వరదలతో వరంగల్ గ్రామీణ జిల్లా అతలాకుతలమైంది. వర్ధన్నపేట పట్టణ శివారు కోనారెడ్డి చెరువుకు గండిపడి సుమారు వేయి ఎకరాల పంట నీటిమునిగింది. పంట నష్టం వాటిల్లిన వరి పొలాలను మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించారు.
![పంట నష్టంపై అధికారుల అభయం పంట నష్టంపై అధికారుల అభయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8553292-249-8553292-1598361545881.jpg)
పంట నష్టంపై అధికారుల అభయం
కోనారెడ్డి చెరువు ఆయకట్టు సహా... కట్ట క్రింది భాగం వరద ప్రవాహానికి రేగడి పొలంలో... నాపరాళ్ళు తేలి బోడుగా మారాయి. దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా వరి పంట... పూర్తి స్థాయిలో కొట్టుకుపోయిందని అధికారులు గుర్తించారు. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం త్వరగా ఇప్పించే ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు.