వరంగల్ గ్రామీణ జిల్లాలో సమీకృత వ్యవసాయ విస్తరణకు వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు గ్రామాల్లో తిరుగుతూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వర్ధన్నపేట ఆకేరు వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్న రైతులకు ఇల్లంద గ్రామంలో సమీకృత వ్యవసాయం గురించి వివరించారు.
సమీకృత వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన
వరంగల్ గ్రామీణ జిల్లాలో సమీకృత వ్యవసాయ విస్తరణకు వ్యవసాయ అధికారులు నడుం బిగించారు. గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు సమీకృత అవగాహన పట్ల అవగాహన కల్పిస్తున్నారు. వర్ధన్నపేటలోని ఆకేరు వాగు పరివాహక ప్రాంతాల్లోని రైతులకు సమీకృత సాగు గురించి వివరించారు.
సమీకృత వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన
భూసార పరిరక్షణ చర్యలు, మొక్కల పెంపకం వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా అందిస్తుందని తెలిపారు. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి రాం నర్సయ్య రైతులను కోరారు. సమీకృత వ్యవసాయంలో గేదెలు, ఆవులు, గొర్రెలు, కోళ్లు పెంచడం వల్ల భూసార పరిరక్షించబడుతుందని తెలిపారు. గుట్టల చుట్టూ కందకాలు, రాతి కట్టడాలు, నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.