తెలంగాణ

telangana

ETV Bharat / state

విత్తన దుకాణాల్లో అధికారుల తనిఖీలు - అధికారుల తనిఖీలు

వరంగల్​ గ్రామీణ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేశారు. గ్రామీణ స్థాయి నుంచి.. పట్టణాల పరిధిలోని విత్తనాల దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. జిల్లాలోని వర్ధన్నపేట మున్సిపాలిటీలోని పలు విత్తన, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేశారు.

Agriculture Officers Inspects in Fertilizer Shops
విత్తన దుకాణాల్లో అధికారుల తనిఖీలు

By

Published : May 30, 2020, 4:53 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లాలోని వర్ధన్నపేట మున్సిపాలిటీలో వ్యవసాయ అధికారులు విత్తన, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. వర్షాకాలం దగ్గర పడుతుండడం వల్ల రైతులు నకిలీ విత్తనాలు, ఎరువుల వల్ల రైతులు నష్టపోకుండా సీజన్​ కంటే ముందే తనిఖీలు చేస్తున్నట్టు వర్ధన్నపేట మండల వ్యవసాయ అధికారి రాంనర్సయ్య తెలిపారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలోని అన్నీ విత్తన, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేసినట్లు, నకిలీ ఎరువులు, విత్తనాల పట్ల దుకాణాదారులకు పలు సూచనలు చేశామని అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details