తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్​: పోలీసులు - వర్ధన్నపేట తాజా వార్తలు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పోలీసులు హెచ్చరించారు. వ్యవసాయ శాఖ, పోలీసుల ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్​: పోలీసులు
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్​: పోలీసులు

By

Published : Jun 9, 2020, 3:55 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణ పోలీస్ స్టేషన్​లో వ్యవసాయ శాఖ, పోలీసుల ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ డీలర్లతో సమావేశం జరిగింది. వచ్చే ఖరీఫ్ సీజన్​లో నకిలీ విత్తనాలు అరికట్టేందుకుగాను ఈ సమావేశం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ విత్తనాలను విక్రయించినవారిపై పీడీ యాక్ట్​ పెట్టి లైసెన్స్​ రద్దు చేస్తామని హెచ్చరించారు.

ఎరువుల దుకాణాల యజమానులు అప్రమత్తంగా ఉండి నకిలీ విత్తనాలకు ఎలాంటి అవకాశం లేకుండా వారి వ్యాపారం సజావుగా చేసుకోవాలని అధికారులు వివరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:యాపిల్​ విత్తనాలు తినేశారా? వాటిల్లో విషం ఉంటుందని తెలుసా!

ABOUT THE AUTHOR

...view details