భాజపా రాష్ట్ర కొత్త అధ్యక్షులుగా బండి సంజయ్‌ని నియమించిన నేపథ్యంలో వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల పట్టణంలో భాజపా శ్రేణులు బాణసంచా కాల్చారు..స్వీట్లు పంచిపెట్టారు. సామాన్య కార్యకర్తను అందలం ఎక్కించడం, వారి ఉన్నతిని కోరుకోవడం భాజపాతోనే సాధ్యమని కొనియాడారు.
బండి సంజయ్ నియామకంతో కార్యకర్తల సంబురాలు - bjp activists celebrate parkal
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా బండి సంజయ్‌ని నియమించిన సందర్భంగా పరకాల పట్టణంలో భాజపా శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచారు.
బండి సంజయ్ నియామకంతో కార్యకర్తల సంబురాలు
డబ్బు, కుటుంబ నేపథ్యం చూడకుండా శక్తి సామర్థ్యాలతో ఉన్నత స్థాయికి ఎదగడం భాజపాలో మాత్రమే కనబడుతుందన్నారు. ఇప్పుడు ప్రత్యక్ష నిదర్శనం బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడమే అని కార్యకర్తలు అన్నారు.
ఇదీ చూడండి :ఆర్థిక లావాదేవీలే ఆనంద్‌రెడ్డిని చంపేశాయి : డీసీపీ మల్లారెడ్డి