రోడ్డు ప్రమాదాల నివారణపై వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో పోలీస్ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణను ఒక సామాజిక బాధ్యతగా భావించినప్పుడే ప్రమాదాల సంఖ్య తగ్గించే అవకాశం కలుగుతుందని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.
'వాహనదారులు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ' - traffic rules
వరంగల్ రూరల్ జిల్లా పరకాల డివిజన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీస్ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలని అధికారులు సిబ్బందికి సూచించారు.

'వాహనదారులు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ'
వాహనదారులు కచ్చితంగా రోడ్డు నిబంధనలు పాటించేలా అవగాన కల్పించాలన్నారు. 2020లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 30 శాతానికి పైగా తగ్గించగలిగామన్నారు. వాహనదారులు విధిగా సీటు బెల్టు, హెల్మెట్ ధరించే విధంగా చైతన్యం తీసుకురావాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా నివారించటంలో కీలకంగా వ్యవహరించాలని ఎస్సైలు, సీఐలకు ఏసీపీ శ్రీనివాస్ వివరించారు.