వరంగల్ రూరల్ జిల్లా పోలీసు వాహనం, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. రాయపర్తి మండలం తిరుమలాయపల్లి శివారులో బొమ్మగాని రాజు ద్విచక్ర వాహనంపై మరో ఇద్దరితో కలిసి వెళ్తున్న క్రమంలో అటుగా వస్తున్న పోలీసు వాహనాన్ని గమనించక అదుపుతప్పి ఢీకొట్టాడు.
పోలీసు వాహనం- ద్విచక్ర వాహనం ఢీ, ఇద్దరు మృతి - వరంగల్ రూరల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
వరంగల్ రూరల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసు వాహనం- ద్విచక్ర వాహనం ఢీ, ఇద్దరు మృతి
రాజు అతని భార్య అక్కడికక్కడే మృతి చెందగా కవిత అనే యువతి తీవ్రంగా గాయపడింది. పోలీసులే కవితను ఆస్పత్రికి తరలించారు. పోలీసు వాహనం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న వదంతులకు వర్ధన్నపేట ఏసీపీ వివరణ ఇచ్చారు. ట్రిపుల్ రైడింగ్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన నిర్ధారించారు.
Last Updated : Feb 25, 2020, 9:31 PM IST