తెలంగాణ

telangana

ETV Bharat / state

'లంచమిస్తేనే కల్యాణలక్ష్మి' - CHCKE

కల్యాణ లక్ష్మి చెక్కు కావాలంటే కాసులు కురిపించాల్సిందే. ఫైల్ ముందుకు కదలాలంటే లంచం ఇచ్చుకోవాల్సిందే. కాదంటే కాలయాపనే. ఇదీ వరంగల్ రూరల్ జిల్లా నడికూడా మండల ఆఫీసులో పరిస్థితి.

'లంచమిస్తేనే కల్యాణలక్ష్మి'

By

Published : Mar 2, 2019, 6:41 PM IST

'లంచమిస్తేనే కల్యాణలక్ష్మి'
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కల్యాణ లక్ష్మి పథకంలో అవకతవకలు జరుగుతున్నాయి. చెక్కులు ఇవ్వాలంటే లంచం ఇవ్వాలంటూ వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలం అధికారులు అడుగుతున్నారు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీకి చిక్కాడో ప్రభుత్వాధికారి.

8 నెలలుగా తిరుగుతున్నా...

పరినాం శ్రీనివాస్ రెడ్డి తన కూతురు శ్రీవాణికి రావాల్సిన చెక్కు కోసం గత ఎనిమిది నెలలుగా తిరుగుతున్నాడు. లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. విసిగిపోయిన శ్రీనివాస్ రెడ్డి ఏసీబీకిఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన అధికారులు మాటు వేసి ఐదు వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితుడు సంపత్​పై కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:'బాధ్యులపై త్వరలో చర్యలు'

పరీక్ష రాస్తూనే మృత్యు ఒడికి..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details