Warangal Baahubali:ఓ యువకుడు 50 కేజీలున్న మూడు యూరియా బస్తాలను తలపై ఎత్తికొని అవలిలాగా పొలం గట్లుపై నడిచి పోతున్న వీడియో ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయిని పహాడ్ గ్రామ శివారు చంద్రు తండా కు చెందిన నారావత్ అనిల్ తన పొలానికి ఇలా యూరియా బస్తాలు తీసుకొని పోతున్నారు.
వరంగల్ 'బాహుబలి'.. యువకుడి వీడియో వైరల్ - telanagana latest news
Warangal Baahubali ప్రభుత్వం ఇచ్చిన 25 కేజీల రేషన్ బియ్యం ఇంటికి తీసుకురావలంటే ఎన్ని కష్టాలు పడతామో మనందరికి తెలుసు. 20లీటర్ల నీళ్ల డబ్బాను మన ఇంటికి తీసుకుపోవాలంటే ఎన్ని సార్లు విరామం తీసుకుంటాం. అలాంటిది ఇక్కడ కనిపిస్తున్న ఈ అబ్బాయి ఏకంగా మూడు యూరియా బస్తాల్ని తలపై ఎత్తుకుని తడిసిన పొలం గట్లుపై అవలీలగా తీసుకుని వెళ్లిపోతున్నాడు. అక్కడ ఉన్న కొందరు చూసి దానిని వీడియో తీసి సామజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఇప్పుడు అది చక్కర్లు కొడుతుంది. కొందరు అతడికి వరంగల్ బాహుబలి అని పేర్లు కూడా పెట్టేస్తున్నారు.
వరంగల్ బాహుబలి
ఆ యువకుడిని ఈటీవీ భారత్ పలకరించగా... ఇలా బస్తాలు మోసుక పోవడం తనకు అలవాటేనని, ఇంటి వద్ద సొంతంగా తయారు చేసుకున్న పరికరాలతో నిత్యం వ్యాయామం చేస్తాననని తెలిపాడు. బాక్సర్ కావాలనేది తన ఆశయమని చెప్పాడు. వీడియోని వీక్షించిన నెట్జన్లు అనిల్ చెన్నారావు వరంగల్ 'బాహుబలి' అని పిలుస్తుంటే.. మరికొందరు పొలం గట్లుపై తడబడితే పరిస్థితి ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: