వరంగల్ రూరల్ జిల్లాలో నిర్వహించనున్న గంధం జాతర నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. దామెర మండలం, ఒగ్లాపూర్ లోని సైలానిబాబా దర్గా వద్ద ఏప్రిల్ 2 నుంచి ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి.
సమన్వయంతో పనిచేయండి : పరకాల ఆర్డీఓ - oglapoor sylaanibaaba darga, warangal
వరంగల్ రూరల్ జిల్లాలోని ఒగ్లాపూర్ గంధం జాతర నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వివిధ శాఖల అధికారులతో పరకాల ఇన్ఛార్జి ఆర్డీఓ మహేందర్ సమీక్ష నిర్వహించారు.
వివిధ శాఖల అధికారులతో సమీక్ష
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరకాల ఇంఛార్జ్ ఆర్డీఓ మహేందర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్ రియాజుద్దీన్, ఎస్సై భాస్కర్ రెడ్డి, మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష, విద్యుత్ శాఖ ఏఈ శిరీష్ కుమార్, ఎంపీపీ శంకర్, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.